Jammikunta: జమ్మికుంట KGBV సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

Jammikunta: జమ్మికుంట కస్తూరిబా హాస్టల్‌లో అపరిశుభ్ర ఆహారం, నీటి కొరతపై తెలంగాణ రక్షణ సేన మండిపాటు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్.

GANESH, JAMMIKUNTA
Published on: 23 July 2026 3:13 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంట KGBV సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కస్తూరిబా బాలికల హాస్టల్లో సమస్యలను పరిష్కరించాలని సమస్యలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన మండల అధ్యక్షుడు అంబల హరీష్ డిమాండ్ చేశారు.

గత వారం రోజుల నుండి కస్తూర్బాపాఠశాలలో ఉన్న విద్యార్థినిలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నంలో పురుగులు రావడం నీళ్లతో సాంబార్ చేయడం అదేవిధంగా విద్యార్థులకు వాటర్ సౌకర్యం లేకపోవడం వల్ల స్నానం చేయడానికి బహిర్భూమికి వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రిన్సిపాల్ చూసి చూడనట్టు వ్యవహరించడం వల్ల ఇక్కడ ఉన్న సమస్యలను మండల అధికారులకు గాని జిల్లా అధికారులకుగాని తెలియజేయకుండా ఎవరైనా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చెప్పితే వారిని భయాందోళనలకు గురి చేయడం చేస్తుందని పేర్కొన్నారు.

కూత వేటు దూరంలో ఉన్న మండల అధికారులు కూడా కనీసం వచ్చి విద్యార్థులను పరామర్శించకపోవడం విద్యార్థుల పట్ల విద్యాధికారుల నిర్లక్ష్యం కనబడుతుందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించాలని లేనియెడల తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story