Jammikunta: జమ్మికుంట పట్టణంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి.

GANESH, JAMMIKUNTA
Published on: 2 Jun 2026 5:18 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంట పట్టణంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు, మాట్లాడుతూ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎక్కటీ సంజీవరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్ అన్నం ప్రవీణ్ తెలంగాణ ఉద్యాకారుల పోరాట ఫలితంగా, అమవీరుల త్యాగ ఫలితమే నేటి తెలంగాణ అని అన్నారు. ఈ సందర్భంగా యావత్తు ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేశారు. వేలాది మంది అమరులయ్యారని, లక్షలాది మంది విద్యార్థులు తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడారని, తెలంగాణ ఉద్యమం వైపు ప్రపంచం చూసిందని, అదొక మహా విప్లవమని అన్నారు.

తెలంగాణ యువత , మన హక్కులను కాపాడుకుంటూనే మన బాధ్యతలను కూడా గుర్తుంచుకోవాలి. విద్యను ఆయుధంగా, జ్ఞానాన్ని శక్తిగా చేసుకుని తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అన్నారు.రాష్ట్రం ఏర్పడిన తరువాత 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారులు అత్యంత నిర్లక్ష్యానికి గురయ్యారని అన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ఈ అంశాన్ని ఆరు గ్యారంటీల్లో చేర్చి గౌరవించిందని అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాకారులను గుర్తించి వారికి అండగా నిలువాలని కే కే కమిటీ నీ కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు.ఈ కమిటీ ముఖ్యంగా ఉద్యమకారులను గుర్తించేందుకు 4 కేటగిరీలుగా ఎంపిక చేస్తామని తెలిపింది అన్నారు.ఒకటో క్యాటగిరీలో అమరవీరులు, రెండో క్యాటగిరీలో ఉద్యమంలో గాయాల పాలైన వారు, మూడో క్యాటగిరీలో కేసుల పాలు అయిన వారు, నాలుగో క్యాటగిరీలో ఉద్యమంలో క్షేత్ర స్థాయిలో పని చేసిన వారిని గుర్తించి వారికి ఏ రకమైన గౌరవం సహాయం చేయాలో కమిటీ నిర్ణయించి, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందని ఈ సందర్భంగా తెలపారు.

ముఖ్యంగా నాలుగో క్యాటగిరీ వారి గురించి తెలంగాణ ఉంధ్యమాకారుల ఫోరం కృషి చేస్తుందని రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఎక్కటి సంజీవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ శీలం శ్రీనివాస్, కొలకాని రాజు, జీడి మల్లేష్, కుమార్, టఫ్ నియోజకవర్గ అధ్యక్షులు ఆరే రమేష్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు మద్దూరి శంకరయ్య, రామ్ రాజబాబు, నర్రా భూమిరెడ్డి, కారింగిల రాజేందర్, శ్యామ్, పాతకాల ఓదెలు, రచ్చ గణేష్, ఎగీత కొమురయ్య, ఏభూషి ఓదెలు, బిట్ల శ్రీను, కొంగారి రవీందర్, సమ్మయ్య, మోతే స్వామి, తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story