Jammikunta: పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు.
Jammikunta: పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులకు గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్, హుజురాబాద్ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ జి. మల్లికార్జున స్వామి చైర్‌పర్సన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ఆధ్వర్యంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలను అందజేశారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) మాట్లాడుతూ, జమ్మికుంట మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేసిన డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్‌ను అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఐ రమేష్, కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.




