Jammikunta: జమ్మికుంటలో ఫోటోగ్రఫీ దినోత్సవం.. పేదలకు అన్నదానం
Jammikunta: జమ్మికుంట విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వేడుకలు. ప్రత్యేక పూజల అనంతరం పేదలకు అన్నదానం చేసిన అసోసియేషన్ సభ్యులు.
Jammikunta: జమ్మికుంటలో ఫోటోగ్రఫీ దినోత్సవం.. పేదలకు అన్నదానం
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం బొమ్మల గుడిలో రోజువారిలగనే అన్నదానం అన్నపూర్ణ సేవా సమితి వారు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాకు దేవుడిచ్చిన వరం లాంటి వృత్తి మా ప్రపంచ ఫోటోగ్రాఫ్ దినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యయి నిరుపేదలైన వారికి అన్నదానం చేయడం లో తృప్తి ఉంటదని ఫోటోగ్రఫీ దినోత్సవం రోజు వారికి అన్నదానం చేయడం జరిగింది.
జమ్మికుంట మండల ఫోటో వీడియో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆలయంలో ఫోటోగ్రాఫ్ దినోత్సవం అర్చకులతో అర్చన చేపించి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకున్న ఫోటోగ్రాఫర్లు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జమ్మికుంట ప్రెసిడెంట్ ముస్తఫా. వైఎస్ ప్రెసిడెంట్ రాజు. నాగేందర్. రచ్చ గణేష్. బికే వెంకన్న. రాంబాబు. సత్యం. భాస్కర్. కుమార్. పవన్ శ్రీనివాస్ .బిట్ల తిరుపతి. రంజిత్. ఎలగం శీను శివ. సాయి శివ. కృష్ణ సుంకరి రమేష్.




