Jammikunta: జమ్మికుంట మున్సిపల్ అవినీతిపై ఏసీబీ, విజిలెన్స్ తీరుపై బీజేపీ ఆగ్రహం!
Jammikunta: జమ్మికుంట మున్సిపాలిటీలో కోట్ల నిధుల దుర్వినియోగంపై అప్పటి కమిషనర్, చైర్మన్‌లను వదిలి కింది సిబ్బందిపైనే చర్యలు తీసుకోవడంపై బీజేపీ ధ్వజమెత్తింది.
Jammikunta: జమ్మికుంట మున్సిపల్ అవినీతిపై ఏసీబీ, విజిలెన్స్ తీరుపై బీజేపీ ఆగ్రహం!
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో మున్సిపల్ లో జరిగిన అవినీతి పై పత్రిక సమావేశం నిర్వహించారు, ఈసందర్భంగా కొలకాని రాజు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కనుమల్ల విజయ, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ మాట్లాడుతూ...
జమ్మికుంట మున్సిపల్ లో జరిగిన అవినీతిని స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు ఖండించడం లేదని, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రణవ్ బాబు పట్టించుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు,కౌన్సిల్ తీర్మానం లేకుండా కింది స్థాయి అధికారులు నిధులు దుర్వినియోగం చేసినట్లయితే, దానికి కమిషనర్ మున్సిపల్ చైర్మన్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యులు అవుతారని, మున్సిపాలిటీ నిధులకు కమిషనర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా వ్యవహరిస్తారని , తీర్మానం లేని బిల్లులు, అక్రమ చెల్లింపులు లేదా ఫండ్ విడుదలపై నిఘా పెట్టడం కమిషనర్ ప్రాథమిక విధి.
అప్పటి కమీషనర్, చైర్మన్లకి తెలియకుండా కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం లేదని, వారిపై చర్యలు తీసుకోకుండా కింది స్థాయి సిబ్బంది పై చర్యలు తీసుకోవడంలో ఏసీబీ, విజిలెన్స్ అధికారులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
కోట్ల రూపాయల అవినీతి పై విజిలెన్స్ అధికారులు విచారణ పేరుతో ఆరునెలల పాటు కాలయాపన చేసి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు, కేవలం 32 లక్షల రూపాయలు మాత్రమే రికవరీ చేయాలని, కింది స్థాయి సిబ్బందిని బాధ్యులు చేయడం ద్వారా అప్పటి కమీషనర్, చైర్మన్ లకి విజిలెన్స్ అధికారులకు ఏమైనా లోపాయికారీ ఒప్పందం కుదిరిందా అని అనుమానం వ్యక్తం చేశారు.
జమ్మికుంట మున్సిపాలిటీలో జరిగిన భారీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మున్సిపాలిటీని అవినీతి కూపంగా మార్చితే ఊరుకునేది లేదని తక్షణమే ఈ నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం, కలెక్టర్ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా మరియు ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఓబిసి అధ్యక్షులు ఆకుల రాజేందర్, బచ్చు శివన్న, కైలాసకొటి గణేష్, రాచపల్లి ప్రశాంత్, ఆడువాల శ్రీధర్, కేస స్వరూప, గరెపల్లి నిరూపరాణి, ఆకుల తిరుపతి, పల్లపు రవి, కొండ్లె నగేష్, గంగాభవాని, పుల్లూరి ప్రశాంత్, రాయబారపు సురేష్, బల్సుకూరి రాజేష్, శ్రీవర్తి అఖిల్, అప్పాల రవిందర్, ముకుందా సుధాకర్, యాంసాని సమ్మయ్య, పోలు వెంకటేష్, నెల్లి రాజు, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




