Jammikunta: కన్నీటి వీడ్కోలు.. ఆయన చేసిన అభివృద్ధి పనులే సాక్ష్యం!
Jammikunta: జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ బదిలీ కావడంతో మున్సిపల్ సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.
Jammikunta: కన్నీటి వీడ్కోలు.. ఆయన చేసిన అభివృద్ధి పనులే సాక్ష్యం!
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ ఆఫీసులో రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహించి జమ్మికుంట మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిన మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ను మున్సిపల్ అధికారులు, సిబ్బంది శాలువాలతో సత్కరించి, వీడ్కోలు పలికారు. కమిషనర్ మహమ్మద్ అయాజ్ గత రెండు సంవత్సరాల కాలంలో జమ్మికుంట పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పనులలో ముందు నడిపించారు జమ్మికుంట పట్టణం అధికారులు కొనియాడారు. పట్టణంలో ఇంటి పన్ను వసూళ్లలో రెండు పర్యాయాలు రాష్ట్ర స్థాయిలో మొదటి వరుసలో నిలిపిన వ్యక్తి అని వారు అన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బదిలీపై తోటి అధికారులు మాట్లాడుతూ మా పై అధికారి అయినప్పటికీ చూడకుండా మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆప్యాయతో పలకరించి మాతో ఒక్కడిగా ఉండి ఆఫీసులో పనులు నుంచి మర్యాదగా మాట్లాడే అధికారి అని అతన్ని గుర్తు చేసుకుంటూ మంచి ఆఫీసర్ అని ఈ సారు ఎన్నడూ మరువలేవని కొనియాడారు బదిలీపై వెళుతున్న ఆఫీసర్ ద్వారా మాకు ఎనలేని అవార్డులు వచ్చాయ మా పనికి తగ్గట్టుగా అవార్డులు ఇచ్చే వారు అని జమ్మికుంట మున్సిపల్ ఆఫీసులో. పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాలతో సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, జె. ఏ. వో రాజశేఖర్ రెడ్డి, టిపివో శ్రీధర్, టిపిఎస్ రాజ్ కుమార్, ఆర్ ఐ భాస్కర్, సీనియర్ అసిస్టెంట్ వాణి, శ్రీనివాస్. ఫాష. బోలా సదానందం తో పాటు పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




