Jammikunta: జమ్మికుంట 7 రోజుల్లో గోవులను తీసుకెళ్లండి చైర్మన్
Jammikunta: రోడ్లపై గోవులను వదిలేస్తే చర్యలు తప్పవు. 7 రోజుల్లోపు యజమానులు ఆవులను తీసుకెళ్లాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ హెచ్చరిక.
Jammikunta: జమ్మికుంట 7 రోజుల్లో గోవులను తీసుకెళ్లండి చైర్మన్
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఆధ్వర్యంలో పశువైద్యాధికారి రాజ్ కుమార్ పర్యవేక్షణ లో గోవు ప్రసవం ఇట్టి సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ముఖ్య గమనిక జమ్మికుంట పట్టణంలోని కొంతమంది గోవుల యజమానులు తమ ఆవులను రోడ్లపై వదిలివేస్తుండటంతో రోడ్లపైనే ప్రసవాలు జరగడం, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలగడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి.
ఇప్పటివరకు జమ్మికుంట మున్సిపాలిటీ, పశుసంవర్ధక శాఖ వెటర్నరీ వైద్యుల ఆధ్వర్యంలో గో సంరక్షణ కార్యక్రమంలో భాగంగా రోడ్లపై ఉన్న నాలుగు గోవులకు సురక్షితంగా ప్రసవాలు నిర్వహించడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఎంతో బాధాకరమైనవి.అందువల్ల గోవుల యజమానులందరూ 7 రోజులలోపు తమ ఆవులను తప్పనిసరిగా తీసుకెళ్లి సంరక్షించుకోవాలని ఆదేశించడమైనది లేనిపక్షంలో రోడ్లపై గోవులను వదిలివేసే యజమానులపై మున్సిపల్ చట్టాల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానాలు కూడా విధించబడతాయి తెలిపారు.




