Jammikunta: జమ్మికుంటలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసిన కౌన్సిలర్!
Jammikunta: జమ్మికుంట 5వ వార్డు పిట్టలవాడలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులను ప్రారంభించి లబ్ధిదారులను సన్మానించిన కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్.
Jammikunta: జమ్మికుంటలో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసిన కౌన్సిలర్!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో 5th వార్డు లో కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ ఇందిరమ్మ గృహాలకు ముగ్గు పోయినారు . కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం లో భాగంగా జమ్మికుంట మున్సిపాలిటీ 5th వార్డులో నీ పిట్టల వాడ లో ఇటీవల మంజూరైన గృహ నిర్మాణదారులైన బిట్ల స్వప్న
బుర్రి లక్ష్మి ను కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ లబ్ధిదారులను సన్మానించి .వారి నూతన గృహ నిర్మాణం కొరకు ముగ్గు పోయడం జరిగింది. కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు అయినా సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వం.
సంక్షేమ పథకాలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతాయి అని చెప్పేందుకు నిదర్శనం.మహిళలకు ఫ్రీ బస్సులకు యజమానులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం మనం చూస్తున్నాం. ప్రతి పేదవారకి రేషన్ కార్డులు మంజూరి చేసి వారికి సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది.ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం.
రైతులకు సన్న వడ్లకు 500/- రూ. లు ఇవ్వడం జరిగింది. రెండు లక్షల లోపు రుణమాఫీ చేయడం .త్వరలోనే పెన్షన్లు మంజూరు చేస్తున్నాము రాబోయే కాలంలో మా నాయకుడు ఒడితల ప్రణవ్ బాబు ని హుజురాబాద్ MLA గెలవడం ఖాయం అని అన్నారు.




