Jammikunta: కాంగ్రెస్ నిరసన మోదీ, ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలు దహనం!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన. సుంకరి రమేష్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మల దహనం.
Jammikunta: కాంగ్రెస్ నిరసన మోదీ, ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలు దహనం!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుల గొంతును అణచివేయడం, ప్రశ్నించే స్వరాలపై దాడులు చేయడం అత్యంత దురదృష్టకరం. రాజకీయ విభేదాలు ప్రజాస్వామ్యంలో సహజం. అయితే వాటికి సమాధానం హింస, బెదిరింపులు, దాడులు కావు. ఇటువంటి ఘటనలు దేశ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తాయి.
ప్రజల సమస్యలపై నిరంతరం ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ పై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దేశంలో చట్ట పరిపాలన అందరికీ సమానంగా ఉండాలని, ప్రతిపక్ష నాయకుల భద్రతను కూడా ప్రభుత్వం నిర్ధారించాలని కోరుతున్నాం.ఈ నిరసన కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతున్న చర్యలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేసారు..
ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మోలుగురి సదయ్య జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్స్ ఒగ్గు రమేష్ శ్రీపతి స్వర్ణలత నరేష్ పాతకాల మౌనిక అనిల్ చంద రాజు ఎగితా సుజాత అశోక్ మాచర్ల రాజు యట్ల సునీత అశోక్ కుతాడి తిరుపతి ముద్దామల్ల రవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజేశ్వర్ రావు జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దొడ్డే శ్రీకాంత్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గూడెపు సారంగపాని ,లింగ రావు,పూదరి శివ కుమార్ గౌడ్, సలీం ,మండ అశోక్ ఆడెపు కిరణ్ దొగ్గల భాస్కర్ శ్రీనివాస్ పాత ప్రసాద్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శులు కుమ్మరి శ్యామ్,సజ్జద్ మొహ్మ్మద్ మరియు సన్నీ, రాజ్ కుమార్, జఫ్ఫానియా గుర్రం ప్రవీణ్ చెంచాల శ్రీనివాస్ ఎగ్గని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




