Jammikunta: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్!

Jammikunta: జమ్మికుంట కేసవపురం కస్తూరిబా స్కూల్ సమీపంలోని 2BHK ఇళ్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ దిలీప్. నివాసయోగ్యమైన ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి.

GANESH, JAMMIKUNTA
Published on: 24 Aug 2026 4:46 PM IST
Jammikunta
X

Jammikunta: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ ప్రజలందరికీ 2BHK ని కేశవపురం కస్తూరిబా స్కూల్ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఇండ్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు ఎందుకంటే ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ పంపిణీలో లబ్ధిదారులందరినీ కూడా సెలెక్ట్ చేసే పరిస్థితి ఉంది ప్రజలందరు కూడా అక్కడ ఇండ్లన్ని పూర్తి అయిపోయినాయి మాకు మంజూరు చేసినటువంటి పత్రాలు ఇస్తే దానిలో పోయి నివాసంగా ఉండొచ్చు అని అనుకుంటున్నారు.

జమ్మికుంటకు మొత్తం కూడా 500 డబుల్ బెడ్‌రూమ్‌లు అప్పుడు ఉన్నటువంటి బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వమే ఇది నిర్మాణం మొదలుపెట్టి పూర్తి అయ్యే దశలో ప్రభుత్వము మారడం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కొద్దిరోజులకే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను గాని మేము ఏం చేయము మీకు డబుల్ బెడ్‌రూమ్‌లు ఇవ్వలేదు అని చెప్పి మూడు సంవత్సరాలు పూర్తి కావస్తుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వానికి జమ్మికుంట మున్సిపల్ కౌన్సిల్ తరపున ప్రజలను ఎవరినీ కూడా ఎవరూ మోసం చేయొద్దు ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలకి మెరుగైన సదుపాయాలు ఉండడానికి ఒక మంచి ఇల్లు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఏ ప్రభుత్వానైనా ప్రజలు ఆదరిస్తారు. కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి 2BHK ని పంచడానికి హడావుడి మేము గెలిచి ఇప్పుడు ఆరు నెలల కాలం పూర్తొస్తుంది,ఆరు నెలల నుంచి ఇగో రేపు, ఇగో రేపు,ఇగో రేపు అని చెప్పి వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు.

నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా గౌరవనీయులు గృహనిర్మాణ శాఖ మంత్రి కూడా తప్పకుండా ప్రజలకు మిగిలిన ఏదైతే రిమైనింగ్ వర్క్ అక్కడ పెండింగ్ ఉందో, ఆ యొక్క లబ్ధిదారునికే మేము నగదు ఇచ్చి ఆ కన్‌స్ట్రక్షన్ పూర్తి చేస్తాము ఉదాహరణకి జమ్మికుంటలో 500 ఇండ్లు ఇక్కడి నుంచి మేము జిల్లా కలెక్టర్ కి ఇక్కడున్నటువంటి మంత్రులకి, ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి రాజకీయ విమర్శలు మాకు అవసరం లేదు ఇక్కడున్నటువంటి మీరు ఎవరికైతే లబ్ధిదారులకి ఇస్తా అన్నారో, ఒక్కసారి ఆ లబ్ధిదారులని మీరు మంజూరు చేసిన లబ్ధిదారులను ఒక్కసారి ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లని వాళ్ళనే పరిశీలించమనండి,లేదంటే మీరు కూడా రండి లేదు ఇక్కడ ఎంత ఖర్చు అవుతది,ఎంత నిధులు కేటాయిస్తే ఈ డబుల్ బెడ్‌రూమ్‌లు అన్నీ పూర్తి కావస్తాయి.

ఈరోజు ప్రజలకి అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలని ఆశగా ఎదురుచూసే విధంగా ప్రభుత్వాలు చేయొద్దు దయచేసి జిల్లా కలెక్టర్ , స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ ,హౌసింగ్ పీడీ ఎంతసేపూ ఇక్కడ 240 ఇండ్లు ఉన్నాయి అని చెప్పి కస్తూరిబా స్కూల్ దగ్గరనే ఇక్కడ నిర్మాణ దశలో రేపు పొద్దున వచ్చి నివాసయోగ్యంగా ఉండడానికి ఉన్న ఇండ్లు మాత్రము 24 ఇండ్లు మాత్రమే నివాసయోగ్యంగా రేపు పొద్దున వచ్చి ఊడ్చుకొని కిటికీలో దర్వాజాలో పెడితే ఉండొచ్చు మిగతావన్నీ ఒకటేమో ఫౌండేషన్ స్టేజ్‌లో ఉంది.

ఒకటేమో పిల్లర్ స్టేజ్‌లో ఉంది, ఒకటేమో G+1 కట్టి G+2 పెండింగ్‌లో ఉన్నది లోపట ఇక్కడున్నటువంటి మెటీరియల్‌ని కన్‌స్ట్రక్షన్ అంతా కూడా గుర్తితెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు అంటే పూర్తిగా కూడా శిథిలంలో అంటే ఇక్కడ ఎవరూ నివసించే పరిస్థితి లాగా కనబడడం లేదు. దయచేసి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమాచారం తెలుసుకున్న తర్వాత డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేయగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ శీలం శ్రీనివాస్, కొలుగురి సురేష్, ఫిరోజ్, మైస రవి,పరశురామ్,శంకర్,శివ తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story