Jagtial: జగిత్యాల జిల్లాలో విషాదం కుంటలో మునిగిఇద్దరు విద్యార్థుల మృతి

Jagtial: జగిత్యాల జిల్లా మల్యాలలో కుంటలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. సమాచారం ఇవ్వకుండా పోస్టుమార్టం చేశారంటూ తల్లిదండ్రుల ధర్నా.

ANAND, JAGITYAL
Published on: 4 Aug 2026 12:03 PM IST
Jagtial
X

Jagtial: జగిత్యాల జిల్లాలో విషాదం కుంటలో మునిగిఇద్దరు విద్యార్థుల మృతి

జగిత్యాల. జిల్లా...

జగిత్యాల జిల్లా మల్యాల ఎస్సీ హాస్టల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. హాస్టల్ వెనుక ఉన్న కుంటలో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు విష్ణు (11), సుశాంత్ (10) ప్రమాదవశాత్తు మునిగి ప్రాణాలు కోల్పోయారు.

తమకు సమాచారం ఇవ్వకుండా, అనుమతి లేకుండానే మృతదేహాలకు పోస్టుమార్టం చేశారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులకు కొంతమందిని అదుపులోకి తీసుకొని మరి కొంతమందికి సర్దిచెప్పడంతో నిరసన సద్దుమణిగింది

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story