Jagtial: కలెక్టరేట్ ఎదుట TGE JAC ఆధ్వర్యంలో ఉద్యోగుల భారీ ఆందోళన

Jagtial: పెండింగ్ డీఏలు, పీఆర్‌సీ అమలు కోరుతూ జగిత్యాల కలెక్టరేట్ ఎదుట TGE JAC ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.

ANAND, JAGITYAL
Published on: 27 Aug 2026 4:52 PM IST
Jagtial
X

Jagtial: కలెక్టరేట్ ఎదుట TGE JAC ఆధ్వర్యంలో ఉద్యోగుల భారీ ఆందోళన

జగిత్యాల: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ 'తెలంగాణ ఉద్యోగ జేఏసీ' (TGE JAC) ఆధ్వర్యంలో గురువారం జగిత్యాల కలెక్టరేట్ ఎదుట భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న డీఏ (DA)లను వెంటనే విడుదల చేయాలని, పీఆర్‌సీ (PRC)ని తక్షణమే అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

ఈ ఆందోళన కార్యక్రమానికి బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి టీ. జీవన్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ హాజరై ఉద్యోగులకు పూర్తి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యోగుల తరఫున పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో TGE JAC జగిత్యాల జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి, జిల్లా కన్వీనర్ కందుకూరి రవి బాబులతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story