Malyala: జగిత్యాల జిల్లాలో బస్సు-లారీ ఢీ 25 మందికి గాయాలు
Malyala: జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 25 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలు.
Malyala: జగిత్యాల జిల్లాలో బస్సు-లారీ ఢీ 25 మందికి గాయాలు
మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్ సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో దాదాపు 25 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం:
జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కరీంనగర్ వైపు నుంచి జగిత్యాలకు వస్తున్న లారీ బల్వంతపూర్ వద్దకు రాగానే ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద ధాటికి రెండు వాహనాల ముందుభాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బస్సులోని ప్రయాణికులు భయంతో కేకలు వేశారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే వాహనాల నుంచి బయటకు తీసి జగిత్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో కొంతసేపు భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న మల్యాల పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.




