Jagtial: జగిత్యాలలో భూ బాధితుల ఆవేదన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు!
Jagtial: జగిత్యాల జిల్లా రాగోజీపేట భూ బాధితుల ప్రజావాణి ఫిర్యాదు. సర్వే నివేదిక ఉన్నా దౌర్జన్యం చేస్తున్నారంటూ ఉన్నతాధికారులకు వినతి.
Jagtial: జగిత్యాలలో భూ బాధితుల ఆవేదన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు!
Jagtial: తమకు సంబంధించిన భూమి విషయంలో అన్యాయం జరుగుతోందని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని జగిత్యాల జిల్లా రాగోజీపేట గ్రామానికి చెందిన నాలుగు టీవీ కుటుంబాల బాధితులు ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు.
తమ స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ, కొందరు వ్యక్తులు అక్రమంగా జోక్యం చేసుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వివాదాస్పద సర్వే నంబర్‌పై రెవెన్యూ అధికారులు స్పందించి, సర్వే నిర్వహించి తమకు అనుకూలంగా నివేదిక ఇచ్చారని తెలిపారు.
అయినప్పటికీ రెబ్బాస్ రవి అనే వ్యక్తి దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని, గతంలో పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.




