Jagtial: మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయాలని రైతు వినూత్న నిరసన

Jagtial: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండలో మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ కోరుతూ రైతు దోప్పల జలంధర్ వినూత్న నిరసన. నారుతో ప్రభుత్వానికి విజ్ఞప్తి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 July 2026 4:25 PM IST
Jagtial
X

Jagtial: మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయాలని రైతు వినూత్న నిరసన

జగిత్యాల: కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయాలని రైతు దోప్పల జలంధర్ వినూత్నంగా నిరసన తెలిపారు.

జలంధర్ తన పొలంలో వేసిన నారుతో మేడిగడ్డ బ్యారేజ్ ను రిపేర్ చేయాలని నారు పోసి ప్రభుత్వానికి విన్నూత్నంగా విన్నపం చేశాడు.

తను పొలం సాగు చేయాలంటే ఎస్సారెస్పీ వర్ధకాలువ నీరు ద్వారానే అని, వర్షాలు లేకపోవడం వల్ల మెడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేసినట్లయితే మా పొలాలు పండుతాయి అని వాపోయారు.

ప్రభుత్వాలు వచ్చి పోయినా కానీ రైతులకు న్యాయం చేయాలని సాగు, తాగునీరు అందించాలని పిలుపునిచ్చారు.వీలైతే ప్రభుత్వం రిపేర్ చేసి వెంటనే ఎగువ ఉన్న ప్రాంతానికి నీరు అందించాలని కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story