Jagtial: జగిత్యాల బైపాస్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు!

Jagtial: జగిత్యాలలో క్రిప్టో కరెన్సీ ఆర్థిక లావాదేవీల వివాదం.. వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించిన ఏడుగురు నిందితుల అరెస్ట్, వివరాలు వెల్లడించిన డీఎస్పీ.

ANAND, JAGITYAL
Published on: 16 Sept 2026 4:53 PM IST
Jagtial
X

Jagtial: జగిత్యాల బైపాస్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు!

Jagtial: జగిత్యాల క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీల వివాదం జగిత్యాలలో తీవ్ర కలకలం రేపింది. జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామానికి చెందిన మారుతి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి, కత్తితో బెదిరించిన ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జగిత్యాల డిఎస్పీ పురుషోత్తం రెడ్డి తెలిపారు.

కేసు వివరాలు

మారుతి కనిపించకుండా పోవడంతో ఆయన భార్య లావణ్య జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బులు, ఇంటి రిజిస్ట్రేషన్ తమ పేరిట చేయాలని నిందితులు మారుతిని కళ్లకు గంతలు కట్టి గుర్తుతెలియని ప్రాంతానికి తరలించి, కత్తితో బెదిరింపులకు గురిచేసినట్లు తెలిసింది.

ఏడుగురి అరెస్ట్ – వాహనాలు స్వాధీనం:

ఈ దారుణానికి ఒడిగట్టిన అనిల్ రావు, వంశీ కృష్ణ, నిఖిల్, దీక్షిత్, రహేమాన్, సాయి, జగదీశ్వర్‌లను జగిత్యాల బైపాస్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక కారు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బాధిత భార్య ఇచ్చిన ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL