Jagtial: అర్సపల్లి చోరీ కేసు ఛేదన – ఇద్దరు పాత నేరస్థుల అరెస్ట్
Jagtial: జగిత్యాల జిల్లా అర్సపల్లి చోరీ కేసును ఛేదించిన రూరల్ పోలీసులు. ఇద్దరు నిందితుల అరెస్ట్, తులం బంగారం, 6 బైక్‌లు స్వాధీనం.
Jagtial: అర్సపల్లి చోరీ కేసు ఛేదన – ఇద్దరు పాత నేరస్థుల అరెస్ట్
జగిత్యాల: సారంగాపూర్ మండలం అర్పపెల్లి గ్రామంలో ఈ నెల 18న జరిగిన చోరీ కేసును జగిత్యాల రూరల్ పోలీసులు ఛేదించారు. జగిత్యాల రూరల్ సిఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం... అర్పపెల్లికి చెందిన బాధితురాలి ఇంట్లో తులం బంగారు గొలుసు చోరీకి గురవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా రేచపల్లి ఎక్స్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న రేగొండ జగదీశ్వర్, ఎలగందుల పవన్ చందులను అదుపులోకి తీసుకుని విచారించగా, పాత నేరస్థులైన వీరే ఈ చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. అలాగే వీరి నుంచి చోరీ చేసిన తులం బంగారు గొలుసుతో పాటు, వివిధ ప్రాంతాల్లో దొంగిలించి విక్రయించిన 6 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులతో పాటు, దొంగతనానికి గురైన బైక్‌లను కొనుగోలు చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి, ఈరోజు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు.




