Jagtial: ఈ నెల 27న పోలింగ్ కేంద్రాల్లో గ్రామ, వార్డు సభలు.. కలెక్టర్!

Jagtial: జగిత్యాల జిల్లాలో ఈ నెల 27న గ్రామ, వార్డు సభలు. ఓటరు నమోదు, సవరణల కోసం అవకాశం. కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ప్రకటన.

ANAND, JAGITYAL
Published on: 26 Aug 2026 12:42 PM IST
Jagtial
X

Jagtial: ఈ నెల 27న పోలింగ్ కేంద్రాల్లో గ్రామ, వార్డు సభలు.. కలెక్టర్!

Jagtial: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR–2026)లో భాగంగా ఈ నెల 27న జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ భవనాల్లో, పట్టణాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఈ సభలు జరుగుతాయి. BLOలు ముసాయిదా ఓటరు జాబితాను చదివి వినిపిస్తారు.

కీలక అంశాలు:

కొత్త ఓటరు నమోదు (ఫారం-6): 01.10.2026 నాటికి 18 ఏళ్లు నిండే వారు అవసరమైన పత్రాలతో ఫారం-6 సమర్పించాలి.

మార్పులు, సవరణలు (ఫారం-8): పేరు, వయస్సు, చిరునామా, ఫొటో తదితర వివరాల్లో తప్పుల సవరణకు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేయాలి.

అభ్యంతరాలు (ఫారం-7): అర్హత లేని పేర్ల తొలగింపునకు సంబంధిత నియోజకవర్గ ఓటర్లు ఫారం-7 సమర్పించవచ్చు.

అర్హులైన ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అధికారులు పరస్పర సమన్వయంతో ఈ సభలను విజయవంతం చేయాలని ఆదేశించారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story