Jagtial: ఎంపీ ధర్మపురి అరవింద్‌కు రాఖీ కట్టిన డాక్టర్ బోగ శ్రావణి!
Jagtial: రక్షాబంధన్ సందర్భంగా హైదరాబాద్‌లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కలిసి రాఖీ కట్టారు జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగ శ్రావణి.
Jagtial: ఎంపీ ధర్మపురి అరవింద్‌కు రాఖీ కట్టిన డాక్టర్ బోగ శ్రావణి!
జగిత్యాల: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ ధర్మపురిని వారి హైదరాబాద్ నివాసంలో బిజెపి జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ Dr. బోగ శ్రావణి ఆత్మీయంగా కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఎంపీకి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రక్షాబంధన్ ప్రతీక అని, అరవింద్ ధర్మపురికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, మరిన్ని విజయాలు కలగాలని ఈ సందర్భంగా డాక్టర్ శ్రావణి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, నాయకురాళ్లు సింగం పద్మ, గడ్డల లక్ష్మి, సోమలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Next Story




