Karimnagar: గన్నాథుని రథయాత్రను విజయవంతం చేయాలన్న ఎమ్మెల్యే గంగుల!

Karimnagar: ఈ నెల 16న ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగే శ్రీ జగన్నాథ రథయాత్ర పోస్టర్‌ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తన నివాసంలో ఆవిష్కరించి, భక్తులను ఆహ్వానించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 12 July 2026 8:54 PM IST
Karimnagar
X

Karimnagar: గన్నాథుని రథయాత్రను విజయవంతం చేయాలన్న ఎమ్మెల్యే గంగుల!

కరీంనగర్: ఇస్కాన్ ఆధ్వర్యంలో. ఈనెల 16వ తేదీన కరీంనగర్లో నిర్వహించబోయే .శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని మాజీమంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ను ఆహ్వానించిన కమిటీ ప్రతినిధులు.

ఈ సందర్భంగా ఉత్సవానికి సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే గంగుల నివాసంలో గంగుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్నాథుని రథయాత్రను పూరీలో జరిగే విధంగా ఇక్కడ కూడా నిర్వహిస్తున్నారని నగర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వారి కృపకు పాత్రులు కావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల తో పాటు నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరి శంకర్,మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్, వైద్యులు రాజ భాస్కర్ రెడ్డి, ఎస్ ఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బుర్ర మధుసూదన్ రెడ్డి, రమేష్ రెడ్డి అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story