Karimnagar: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం మధురనగర్ సభలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురనగర్‌లో జరిగిన ప్రజాపాలన గ్రామసభలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అడిషనల్ కలెక్టర్ అశ్విని తనాజీ వాకడే పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 April 2026 7:12 PM IST
Karimnagar
X

Karimnagar: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం మధురనగర్ సభలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కరీంనగర్ జిల్లా: గంగాధర మండలం మధురనగర్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్విని తనాజీ వాకడే తో కలిసి గ్రామస్థులతో సమావేశమై, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలపై విపులంగా అవగాహన కల్పించారు. గ్రామ ప్రజల సమస్యలను నేరుగా విని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం మరియు నూతన పెన్షన్ పథకాల దరఖాస్తులను స్వీకరించారు. అలాగే అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువవుతూ, గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తుందని డా. మేడిపల్లి సత్యం తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజల సహకారం అవసరమని, అందరూ కలిసి పనిచేస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దవచ్చని ఆయన పేర్కొన్నారు.

గ్రామ సభ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధికారులు. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story