Karimnagar: ఆచంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం.. సంతోషంలో లబ్ధిదారులు!
Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఆచంపల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
Karimnagar: ఆచంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం.. సంతోషంలో లబ్ధిదారులు!
కరీంనగర్ జిల్లా: గంగాధర మండలం ఆచంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు ఆదివారం శ్రీకారం చుట్టారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ ఆరే తేజశ్రీ రాజశేఖర్ చేతుల మీదుగా లబ్ధిదారురాలు ఎడపల్లి పుష్పలతకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి స్థలంలో ముగ్గు పోయించి నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతి అర్హులైన లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలను పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జక్కుల అనూష శ్రీను, మాజీ సర్పంచ్ పురమళ్ల మనోహర్, పాలకవర్గ సభ్యులు సాయి, విజయ్, అవినాష్, ఆనంద్, మల్లేశం, లచ్చయ్య, వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ కోలపురం లక్ష్మణ్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.




