Karimnagar: పేదల సొంతింటి ముచ్చట.. గోపాల్‌రావుపేట్‌లో సందడి చేసిన కాంగ్రెస్ నేతలు!

Karimnagar: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేట్‌లో ఇందిరమ్మ నూతన గృహ ప్రవేశ వేడుక ఘనంగా జరిగింది.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 12 April 2026 9:22 AM IST
Karimnagar
X

Karimnagar: పేదల సొంతింటి ముచ్చట.. గోపాల్‌రావుపేట్‌లో సందడి చేసిన కాంగ్రెస్ నేతలు!

Karimnagar: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేట్ గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్ దాసరి రాజమణి కనుకయ్య ఇంటి గృహ ప్రవేశానికి స్థానికులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న వెంకటరాం రెడ్డి హాజరై, గృహ యజమానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఇంటి ప్రవేశం ఆనందదాయకమైన ఘట్టమని, కుటుంబానికి సుఖసంతోషాలు, ఆరోగ్యం, అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు కూడా పాల్గొని కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు కలగడం సంతోషకరమని వారు పేర్కొన్నారు.

కార్యక్రమం మొత్తం ఆత్మీయ వాతావరణంలో, శుభాకాంక్షలతో, గ్రామ ప్రజల ఉత్సాహంతో సాగింది.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story