Karimnagar: కరీంనగర్‌లో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ డ్రైవ్ ప్రారంభం!

Karimnagar: కరీంనగర్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రత్యేక సభ్యత్వ నమోదు డ్రైవ్‌ను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రారంభించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 19 May 2026 9:19 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ డ్రైవ్ ప్రారంభం!

కరీంనగర్: భారత రెడ్ క్రాస్ సొసైటీ (Indian Red Cross Society), కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ప్రత్యేక డ్రైవ్‌ను జిల్లా కలెక్టర్ / రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు చిత్రా మిశ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ క్రిమినల్ కేసులు లేనివారు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వాన్ని పొందవచ్చని తెలిపారు. సభ్యత్వం పొందదలచిన వారు సభ్యత్వ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు ప్రతితో పాటు శాశ్వత సభ్యత్వ ఫీజు రూ.1,100/- చెల్లించాలని సూచించారు. సభ్యత్వం పొందిన వారికి శాశ్వత సభ్యత్వ కార్డు అందజేయబడుతుందని తెలిపారు.

ఇప్పటికే సభ్యత్వం పొందిన సభ్యులు తమ వ్యక్తిగత వివరాలలో మార్పులు ఉన్నట్లయితే వెంటనే సరిచేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మొబైల్ నంబర్, చిరునామా మార్పులు, ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు మారదలచిన సభ్యుల ట్రాన్స్‌ఫర్ వివరాలను నవీకరించుకోవాలని తెలిపారు. సభ్యుల వివరాలను సకాలంలో నవీకరించుకోవడం ద్వారా భవిష్యత్తులో నిర్వహించే సభ్యత్వ కార్యక్రమాలలో సమర్థవంతంగా భాగస్వామ్యం కావచ్చని, అత్యవసర పరిస్థితుల్లో అర్హతగల సేవలు అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ స్వయంగా రెడ్ క్రాస్ సభ్యత్వాన్ని స్వీకరించి, రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తరించేందుకు ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. మే 15, 2026 నుండి జూన్ 15, 2026 వరకు ప్రతి రోజు ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు (ఆదివారం సెలవు) రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో సభ్యత్వ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ మహేశ్వర్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పి. కేశవరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఇ.వి. శ్రీనివాస్ రావు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story