Jammikunta: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలి!
Jammikunta: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్. జమ్మికుంటలో బైక్ ర్యాలీ.
Jammikunta: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలి!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో డీసీఎంఎస్ నుండి బొమ్మల గుడి మీదుగా గాంధీ చౌరస్తా ప్రధాన వీధుల గుండా మోత్కులగూడెం చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ 1946నుండి 1951 వరకు ఐదు సంవత్సరాల పాటు సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదట భూస్వాములు,దొరలు జాగిర్దారులు, జమీందారులు, నైజాం నవాబుకు వ్యతిరేకంగా, కుల, మత ప్రాంత,బాషలకి కతితంగా ఈ చారిత్రాత్మక పోరాటం జరిగిందన్నారు.
కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా నాయకత్వంలో సాయుధ పోరాటం కొనసాగిందని దీనిని గమనించిన నెహ్రూ,పటేల్ ప్రభుత్వ సైన్యం రంగంలోకి దిగి నిజాం రాజుతో యధాతధా ఒప్పందం చేసుకున్న యూనియన్ గవర్నమెంట్, కమ్యూనిస్టుల పోరాటాన్ని నిజం ఎదుర్కోలేరని గ్రహించి తెలంగాణ రాజ్యం తమ చేతుల్లోకి తెచ్చుకోవాలని హడావిడిగా పటేల్ సైన్యం 1948 సెప్టెంబర్ 13న రంగంలోకి దిగిందని సెప్టెంబర్ 17న నిజాం రాజ్యం భారత దేశంలో విలీనం అయింది. పటేల్ నెహ్రూ ఏ చరిత్ర లేకుండా నిజాం ను రాజ్ ప్రముఖుగా చేశారన్నారు.
రజాకారులతో కుమ్మక్కై ప్రజల్ని హింసించిన నిజాము రాజును జైల్లో వేసి శిక్షించకుండా పదవిలో కూర్చోబెట్టడం ద్వారా నెహ్రూ పటేల్ ప్రభుత్వం భూస్వాముల వైపు వైపు ఉందని తేలిపోయిందన్నారు.
రజాకార్ల దాడులకు 2000 మంది అమరులైతే, ప్రజల పక్షాన పోరాడుతున్న కమ్యూనిస్టులపై దొరలు భూస్వాములు, రజాకార్లు దాడులు చేసి రెండు వేల మందిని పొట్టన పెట్టుకుంటే, విలీనం తర్వాత యూనియన్ సైన్యం 2500 మంది కమ్యూనిస్టు నాయకులను కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నది పటేల్ సైన్యం, అని ఎర్రజెండా నాయకత్వంలో జరిగిన పోరాటం ఫలితంగా 10 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు తెలంగాణలో పంచబడిందని తెలిపారు.
3500 గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు అయ్యాయన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో సంబంధంలేని నేటి బిజెపి పార్టీ పోరాట స్ఫూర్తిని త్యాగాలను వక్రీకరిస్తూ కేవలం దీనిని అప్పటి నిజాం ముస్లిం రాజు కావున, హిందువులపై దాడిగా చిత్రీకరిస్తూ ఈ ఈ పోరాటానికి మొత్తం రంగు పులుముతుందన్నారు. హిందూ ముస్లిం కొట్లాటగా చిత్రీకరిస్తూ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తుందన్నారు.
సాయుధ పోరాటంలో ఇసుమంతైన పాత్రలేని బిజెపి ఆర్ఎస్ఎస్ శక్తులు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు. దీనిని విమోచన దినంగా ప్రకటించాలని ప్రచారం చేస్తుందని, ఇది సరైన కాదని వాస్తవానికి, భారతదేశంలో అప్పటి హైదరాబాద్ రాజ్యం విలీనం మాత్రమే జరిగిందని తెలిపారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 న విలీన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సాయుధ పోరాట చరిత్రను గ్రామ గ్రామానికి కరపత్రం ద్వారా తీసుకెళ్తామన్నారు. సభలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తామన్నారు.ఈకార్యక్రమంలో, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొప్పుల శంకర్, మండల కార్యదర్శి జక్కుల రమేష్ యాదవ్, కమిటీ సభ్యులు, దండిగారి సతీష్, వడ్లూరి కిషోర్, భాషిర సంపత్ రావు, రాచపల్లి ఐలయ్య, బైరం సమ్మయ్య, గేర రాజకుమారి, కన్నం సదానందం, రాచపల్లి తిరుపతి, సాగర్ల కుమార్, రంజిత్, పోచయ్య, రాజు, పుల్ల కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.




