Karimnagar: ఇసుక డంపులపై టాస్క్‌ఫోర్స్ దాడి.. భారీగా ఇసుక స్వాధీనం!

Karimnagar: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక నిల్వలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. కొండాపూర్, మానకొండూరులో ఇసుక డంపులను సీజ్.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 1 July 2026 11:23 AM IST
Karimnagar
X

Karimnagar: ఇసుక డంపులపై టాస్క్‌ఫోర్స్ దాడి.. భారీగా ఇసుక స్వాధీనం!

కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా, మరియు నిల్వలను అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు సీటీసీ ఏసీపీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ మరియు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

దీనిలో భాగంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొత్తపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో భాగంగా గ్రామానికి చెందిన మింగని నరసయ్య అనే వ్యక్తి తన ఇంటి సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన 15 ట్రిప్పుల ఇసుక డంపును పోలీసులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సదరు ఇసుక నిల్వలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కొత్తపల్లి పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించామన్నారు.

అంతేకాకుండా మానకొండూరు లో మరొక డంపును గుర్తించిన టాస్క్ఫోర్స్ పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకుని మానకొండూరు పోలీసుస్టేషన్ లో అప్పగించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తవ్వడం, నిల్వ చేయడం, లేదా రవాణా చేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.

నిబంధనలు ఉల్లంఘించే వారిపై మైనింగ్ చట్టాలు, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story