Ellanthakunta: ఇల్లంతకుంట రైతులకు ప్రత్యేకంగా ఎరువులు కేటాయించాలి!
Ellanthakunta: ఇల్లంతకుంట మండల రైతులకు ప్రత్యేకంగా ఎరువులు కేటాయించాలని డీఏఓకు వినతిపత్రం సమర్పించిన రైతులు. 2, 3 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారి హామీ.
Ellanthakunta: ఇల్లంతకుంట రైతులకు ప్రత్యేకంగా ఎరువులు కేటాయించాలి!
Ellanthakunta: మండల రైతులు ఎదుర్కొంటున్న యూరియా, ఇతర ఎరువుల కొరత సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా వ్యవసాయ అధికారికి వినతిపత్రం అందజేశారు.
ప్రస్తుతం Fertilizer Sale App/Framework ద్వారా ఎరువుల కేటాయింపు, విక్రయాలు జరుగుతున్న నేపథ్యంలో ఇల్లంతకుంట మండలానికి కేటాయించిన యూరియా ఇతర మండలాల రైతులకు కూడా విక్రయిస్తున్నారని వారు తెలిపారు. దీంతో స్థానిక రైతులకు అవసరమైన సమయంలో యూరియా అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
రైతుల సంఖ్య, సాగు విస్తీర్ణం, పంటల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఇల్లంతకుంట మండలానికి ప్రత్యేకంగా యూరియా, ఇతర ఎరువుల కేటాయింపు చేయాలని కోరారు. మండలానికి కేటాయించిన ఎరువులు ఇతర మండలాల రైతులకు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని, యాప్ లో మండలాల వారీగా కేటాయింపు, విక్రయాలపై పర్యవేక్షణ ఉండాలని విజ్ఞప్తి చేశారు.
వినతిపై స్పందించిన జిల్లా వ్యవసాయ అధికారి 2, 3 రోజుల్లోగా Fertilizer Sale Appలో ఇల్లంతకుంట మండల రైతులకు ప్రత్యేకంగా మండలం కనిపించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిమ్మనగొట్టు శ్రీనివాస్, మేకల మల్లేశం, మిట్టపల్లి మధుసూదన్ రెడ్డి, సామ సంతు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.




