Peddapalli: ఓదెల మల్లన్నను దర్శించుకున్న సీనియర్ ఐఏఎస్ నరహరి!
Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామిని సీనియర్ ఐఏఎస్ నరహరి దర్శించుకున్నారు. ఆలయాభివృద్ధికి తమ ఫౌండేషన్ ద్వారా సాయమందిస్తామన్నారు.
Peddapalli: ఓదెల మల్లన్నను దర్శించుకున్న సీనియర్ ఐఏఎస్ నరహరి!
ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి ఓదెల మల్లికార్జున స్వామి దర్శనం
కేంద్ర జాయింట్ సెక్రెటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి శనివారం పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓదెల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆలయంలో స్వామివారికి ఆయన ప్రత్యేక రుద్రభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా నరహరి మాట్లాడుతూ... ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో విలసిల్లాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు ఈ ప్రాంత ప్రజలకు ఓదెల మల్లన్న కేవలం ఆరాధ్య దైవమే కాకుండా, అందరి జీవితాల్లో సంతోషాలు నింపే ప్రత్యక్ష దైవమని కొనియాడారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలు, ఆనందోత్సాహాలతో విలసిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు.సుమారు 1,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని పునర్నిర్మాణం, నవనిర్మాణంతో పాటు విస్తృతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం, కమిటీ సభ్యులు చేపడుతున్న చర్యలు అభినందనీయమన్నారు.
స్వామివారి దర్శనార్థం ప్రతినిత్యం వేలాదిగా, పండుగ రోజుల్లో లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి మా ఫౌండేషన్ తరఫున భాగస్వామ్యం వహిస్తున్నామని ప్రకటించారు. కొత్తగా నిర్మిస్తున్న ప్రాంగణంలో భక్తులకు అవసరమయ్యే మంచినీటి వసతికి అయ్యే సంపూర్ణ ఖర్చును తమ ఫౌండేషన్ ద్వారా భరిస్తున్నట్లు వెల్లడించారు.
భవిష్యత్తులో కూడా స్వామివారి ఆలయ అభివృద్ధికి, భక్తుల సేవా కార్యక్రమాలకు తమ శక్తివంచన లేకుండా సహాయ సహకారాలు అందిస్తామని, అందరికీ స్వామివారి కృపాకటాక్షాలు లభించాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య కార్యనిర్వాహణాధికారి సదయ్య ఆలయ ధర్మకర్తల సభ్యులు, పద్మశాలి కుల సంఘ నాయకులు ఆలయ అధికారులు, స్థానిక నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.




