Jammikunta: వింగ్స్-11' జట్టుకు జెర్సీలు అందజేసిన హరీష్ వర్మ అప్పని!
Jammikunta: క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్న వింగ్స్-11 జట్టుకు తన్నీరు హరీష్ రావు (THR) టీమ్ రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ వర్మ అప్పని జెర్సీలను అందజేశారు.
Jammikunta: వింగ్స్-11' జట్టుకు జెర్సీలు అందజేసిన హరీష్ వర్మ అప్పని!
జమ్మికుంట: పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా WINGS-11 జట్టుకు తన్నీరు హరీష్ రావు (THR) టీమ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు హరీష్ వర్మ అప్పని జెర్సీలను బహుకరించారు.
ఈ సందర్భంగా హరీష్ వర్మ అప్పని మాట్లాడుతూ, యువతే దేశానికి, సమాజానికి బలమైన పునాది అని అన్నారు. యువత చెడు అలవాట్లు, వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించి, క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలను పెంచుతాయని పేర్కొన్నారు.అదేవిధంగా, ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న తన్నీరు హరీష్ రావు సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, వారి ఆశయాలు ప్రజాసేవా కార్యక్రమాలను యువత సహకారంతో మరింత విస్తృతంగా కొనసాగించేందుకు తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని హరీష్ వర్మ అప్పని తెలిపారు.
సమాజ అభివృద్ధి, యువత సంక్షేమం, క్రీడల ప్రోత్సాహం వంటి కార్యక్రమాలకు THR టీమ్ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.క్రీడలు యువతను ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంటూ, ప్రతి యువకుడు తన ఖాళీ సమయాన్ని క్రీడలకు కేటాయించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా WINGS-11 జట్టు సభ్యులు హరీష్ వర్మ అప్పనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందించిన జెర్సీలు తమలో మరింత ఉత్సాహాన్ని నింపాయని తెలిపారు. ఈ టోర్నమెంట్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి విజయం సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు.




