Jammikunta: ఆబాది జమ్మికుంటలో వైద్య శిబిరం.. మూఢనమ్మకాలపై అవగాహన!
Jammikunta: ఆబాది జమ్మికుంటలో 'ఊరికి కీడు సోకిందనే' మూఢనమ్మకంపై HMTV వెబ్ కథనానికి అధికారులు స్పందించారు.
Jammikunta: ఆబాది జమ్మికుంటలో వైద్య శిబిరం.. మూఢనమ్మకాలపై అవగాహన!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంట గ్రామంలో గత వారం రోజుల క్రితం ఊరుకు కీడు సోకింది అని గ్రామ ప్రజలంతా వనభోజనానికి ఇండ్లకు తాళాలు వేసి వనభోజనం పోయినారు. కీడు వంటలు వార్తను హెచ్ఎంటివి వెబ్బులో ప్రచారం చేసినాము ప్రచారానికి స్పందనగా వైద్య శిబిరం అధికారులు హుజురాబాద్ డిప్యూటీవో డిఎంహెచ్వో ప్రభుదాస్ ఆధ్వర్యంలో ఊరు కౌన్సిలర్లు ఎగిత సుజాత అశోక్. మైసా శిరీష రవి. ప్రోత్సాహంతో గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు.
వాడవాడల డిప్యూటీ డిఎంహెచ్వో ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు అంగడి వాడి టీచర్లు కలిసి వాడవాడలా ఫ్లెక్సీలతో తిరుగుతూ ప్రజలు కీడు వంటలు అనేది నమ్మవద్దని మూఢనమ్మకాలు నమ్మవద్దని మరణాలు అనేది సహజ మరణాలు ఇప్పటికీ ఊర్లో మరణించిన వారు అనారోగ్యంతో కారణాలవల్ల మరణించారని అన్నారు.
దయ్యాలు భూతాలు మంత్రాలు లేవని వాటిని నమ్మొద్దని డిప్యూటీఎంహెచ్వో ప్రభుదాస్ అన్నారు ప్రజలు అనారోగ్యానికి గురి అయితే వారు వెంటనే మీ దగ్గరలో ఉన్న పీఏసీలో మా యొక్క ప్రభుత్వ ఆస్పటల్ కానీ ఏఎన్ఎంలు గాని ఆశ వర్కర్ గనీ చూయించుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్వ్ ప్రభుదాస్ అన్నారు వైద్య శిబిరానికి భారీ స్పందనగా గ్రామస్తులంతా వచ్చారు వీరి వెంట గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




