Huzurabad: మనిషి చనిపోయినా మారని లోకం.. కేశపట్నంలో గుండెల్ని పిండేసే ఘటన!

Huzurabad: కరీంనగర్ జిల్లా కేశపట్నంలో దయనీయ ఘటన. అనారోగ్యంతో మృతి చెందిన యువకుడి మృతదేహాన్ని తోపుడు బండిపై తరలించిన కుటుంబ సభ్యులు.

RAJU, HUZURABAD
Published on: 4 May 2026 9:54 AM IST
Huzurabad
X

Huzurabad: మనిషి చనిపోయినా మారని లోకం.. కేశపట్నంలో గుండెల్ని పిండేసే ఘటన!

కరీంనగర్ జిల్లా: హుజురాబాద్.. అనారోగ్యంతో మృతి చెందిన ఓ యువకుడు మృతి దేహాన్ని కుటుంబ సభ్యులు తోపుడు బండిపై ఇంటికి తీసుకెళ్లిన దయనీయ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశపట్నం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కేశపట్నానికి చెందిన ఎలుకపల్లి యాకుబ్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు అతని కుటుంబ సభ్యులు మెయిన్ రోడ్డుపై అరటిపండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనో పధి పొందుతున్నారు అయితే ఆదివారం తన షాప్ కు వచ్చిన అతడు పరిస్థితి విషమించి అక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు చూడగా ఎలాంటి వాహనం రాకపోగా చుట్టుపక్కల వారు ఎవరు సాయం చేయలేదు దీనితో వారే వారి దగ్గర ఉన్న తోపుడు బండిపై మృతదేహాన్ని ఇంటికి తరలించారు.

RAJU, HUZURABAD

RAJU, HUZURABAD

Next Story