Kothapalli: చేనేత సహకార సంఘ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్!

Kothapalli: చేనేత సహకార సంఘ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 30 Jun 2026 4:55 PM IST
Kothapalli
X

Kothapalli: చేనేత సహకార సంఘ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్!

కరీంనగర్: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి చేనేత సహకార సంఘ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులైన అభ్యర్థులు ఘన విజయం సాధించారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విజేతలకు శాలువాలు కప్పి సన్మానించి, మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. చేనేత సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు దూస మునీందర్, ఉపాధ్యక్షుడు నడిమెట్ల చంద్రమౌళి, కోశాధికారి సిరిపురం హనుమండ్లు, డైరెక్టర్లు ఎలిగేటి రాజేశం, కోడూరి రాజేశం, బీఆర్ఎస్ నాయకులు జమీల్ ఉద్దీన్, ఎస్‌కే బాబా, రాంబాబు, శ్రీకాంత్, ఫక్రుద్దీన్, సుధాకర్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story