Sircilla: ఆగస్టు 5న సిరిసిల్లలో చేనేత చైతన్య మహాసభ!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 5న నిర్వహించనున్న చేనేత చైతన్య మహాసభ కరపత్రాన్ని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఆవిష్కరించారు.

KALEEM, SIRICILLA
Published on: 3 Aug 2026 11:43 AM IST
Sircilla
X

Sircilla: ఆగస్టు 5న సిరిసిల్లలో చేనేత చైతన్య మహాసభ!

Sircilla: సిరిసిల్లలో చేనేత చైతన్య మహాసభ కరపత్రం ఆవిష్కరణ.. ఆగస్టు 5 సభను విజయవంతం చేయాలని పిలుపు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 5న కరీంనగర్ పద్మశాలి కళ్యాణ మండపంలో నిర్వహించనున్న చేనేత చైతన్య మహాసభకు సంబంధించిన కరపత్రాన్ని సోమవారం సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.

తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహాసభలో చేనేత కళాకారులు, చేనేత సహకార సంఘాల చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లను ఘనంగా సన్మానించనున్నట్లు తెలంగాణ చేనేత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు శ్రీగాధ మైసయ్య, పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మండల సత్యం తెలిపారు.

చేనేత అభివృద్ధి, కళాకారుల సంక్షేమం, సంఘటిత శక్తితో సమస్యల పరిష్కారమే మహాసభ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారందరూ పెద్ద సంఖ్యలో హాజరై చేనేత చైతన్య మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, ఉపాధ్యక్షులు గాజుల బాలయ్య, మోర రవి, కోశాధికారి ఎల్లె శ్రీనివాస్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపల్లి పూర్ణచందర్, ప్రధాన కార్యదర్శి గెంట్యాల శ్రీనివాస్, తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుజ్జె తార, ఉపాధ్యక్షురాలు పత్తిపాక పద్మ, కౌన్సిలర్ దర్నం అరుణ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story