Jagtial: గుండు పిన్ను మొనపై అద్భుతమైన మట్టి గణపతిని మలచిన గిన్నిస్ రికార్డర్!

Jagtial: జగిత్యాల జిల్లాకు చెందిన గిన్నిస్ రికార్డ్ గ్రహీత డాక్టర్ గుర్రం దయాకర్ సూక్ష్మ కళాఖండం.

ANAND, JAGITYAL
Published on: 14 Sept 2026 4:21 PM IST
Jagtial
X

Jagtial: గుండు పిన్ను మొనపై అద్భుతమైన మట్టి గణపతిని మలచిన గిన్నిస్ రికార్డర్!

Jagtial: సాధన ఉంటే అంగుళం స్థలంలోనూ విశ్వరూపాన్ని చూపించవచ్చని జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గౌరవ డాక్టరేట్ మరియు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత డాక్టర్ గుర్రం దయాకర్ మరోసారి నిరూపించారు. గణపతి నవరాత్రుల పురస్కరించుకుని ఆయన గుండు పిన్ను మొనపై అద్భుతమైన మట్టి వినాయకుడిని తయారు చేసి తన అసమాన కళా ప్రావీణ్యాన్ని చాటుకున్నారు.

10 గంటల శ్రమ – అసాధారణ ఏకాగ్రత: కంటికి సరిగ్గా కనిపించని గుండు పిన్నుపై కేవలం మన్ను, వాటర్ కలర్స్ ఉపయోగిస్తూ వరుసగా 10 గంటల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఆయన చూపిన ఏకాగ్రత, అంకితభావం అభినందనీయం.

పర్యావరణ ప్రేమికుడు: ప్రతి ఏటా వినూత్న రీతిలో విగ్రహాలను రూపొందించే దయాకర్, ఈసారి పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ విగ్రహాన్ని మలిచారు. రసాయన విగ్రహాల వల్ల నీరు, నేల కలుషితమవుతున్నాయని, భవిష్యత్ తరాల బాగు కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని పిలుపునిచ్చారు.

తన అద్భుత హస్తకళతో జగిత్యాల జిల్లా కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతూ, సామాజిక బాధ్యతను చాటుతున్న డాక్టర్ గుర్రం దయాకర్ గారి ప్రతిభ ఎందరికో ఆదర్శనీయం.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL