Karimnagar: కలెక్టరేట్ వద్ద గ్రామపంచాయతీ కార్మికుల 48 గంటల దీక్ష!
Karimnagar: కలెక్టరేట్ ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు 48 గంటల దీక్ష చేపట్టారు. వేతనాల పెంపు, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
Karimnagar: కలెక్టరేట్ వద్ద గ్రామపంచాయతీ కార్మికుల 48 గంటల దీక్ష!
కరీంనగర్: కరీంనగర్ కలెక్టరేట్ వద్ద గ్రామపంచాయతీ కార్మికుల 48 గంటల దీక్ష ను ప్రారంభించిన సీఐటీయూ జిల్లా కార్యదర్శి గిట్ల ముకుంద రెడ్డి. అనంతరం దీక్షను ఉద్దేశించి ముకుంద రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు పెంచాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని 48 గంటల దీక్షను ప్రారంభించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు కార్మికుల అకౌంట్లో చెల్లించాలని, పంచాయతీ కార్మికులకు గత ఎనిమిది సంవత్సరాలుగా జీతాలు పెరగలేదని, అలాగే, కార్మికులు అందరికీ పిఎఫ్,ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుడు విధినిర్వాహణలో ప్రమాదంతో చనిపోతే 20 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రభుత్వం అందించాలని, కార్మికులందరికీ రెండవ పిఆర్సి పరిధిలోకి తీసుకురావాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.
సర్పంచులు ప్రజాప్రతినిధులు, అధికారుల వేధింపులు అరికట్టాలని, గత ఎనిమిది సంవత్సరాల లో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచడం లేదని వెంటనే ప్రభుత్వం కార్మికులకు జీతాలు పెంచాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలను ఉదృతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఉప్పునుటి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్, గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్, కమిటీ సభ్యులు కాష్పాక, శంకర్,ఎలకపల్లి సారయ్య దాసరపు వెంకటేష్, రామానుజన్, మేకల కమలాకర్, ప్రేమ్ కుమార్, వడ్లూరి లక్ష్మీనారాయణ, బుడిగే అంజన్న లచ్చక్క, లత, స్వరూప మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.




