Odela: రూ.15 కోట్లతో ఓదెల ఆలయ అభివృద్ధి: విప్ విజయరమణ రావు!

Odela: రూ.15 కోట్లతో ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ విజయరమణ రావు తెలిపారు. 22 వసతి గృహాల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

KONDAL, SULTANABAD
Published on: 26 Aug 2026 2:25 PM IST
Odela
X

Odela: రూ.15 కోట్లతో ఓదెల ఆలయ అభివృద్ధి: విప్ విజయరమణ రావు!

ఓదెల: ఓదెల శ్రీ.మల్లికార్జున స్వామి దేవస్థానం ఆవరణలో జరిగే అభివృద్ధి పనులను బుధవారం రోజున దేవాదాయ శాఖ స్థపతి తో కలిసి పరిశీలించిన తదుపరి దాతల సహకారంతో నూతనంగా నిర్మాణాలకు తలపెట్టిన భక్తుల 22 వసతి గృహాల సముదాయానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన గౌరవ రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ముందుగా ప్రభుత్వ విప్ విజయరమణ రావు మల్లిఖార్జున స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ రూ.1.30 కోట్లతో రోడ్లు, ఇతరత్రా అభివృద్ధి పనులను చేపట్టినట్టు మరియు రూ.15 కోట్లతో ఆలయ పునర్నిర్మాణ పనులను చేపట్టనున్నట్టు తెలిపారు. ఇందుకోసం స్థపతితో కలిసి ఆలయ ఆవరణలో పరిశీలించినట్లు తెలిపారు. ఆలయానికి కొత్తగా గోపురాలు, రాతి శిల్పాలతో ప్రకారం నిర్మించి సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.

పర్యాటక శాఖ నుండి మరో 8 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు మంజూరు కానున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నట్టు ప్రభుత్వ విప్ విజయరమణ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, స్థానిక గ్రామ సర్పంచ్ మరియు ఈఓతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పలు గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు మరియు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story