Peddapalli: పెద్దపల్లిలో ఘనంగా కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ!

Peddapalli: కాంగ్రెస్ 1000 రోజుల పాలన వేళ పెద్దపల్లిలో భారీ విజయోత్సవ ర్యాలీ.. నాయకత్వం వహించిన ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు.

RAJU, PEDDAPALLI
Published on: 5 Sept 2026 2:41 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లిలో ఘనంగా కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ!

Peddapalli: పెద్దపల్లిలో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.పెద్దపల్లి పట్టణంలోని చీకురాయి రోడ్డు నుంచి జెండా ఏరియా వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ జెండాలు చేతబూని, ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రాబోయే రోజుల్లో పెద్దపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొగిల్ల మల్లయ్య కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు...

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI

Next Story