Sircilla: నూలు పౌర్ణమి వేళ మార్కండేయ శోభాయాత్రలో పద్మశాలీలు!

Sircilla: నూలు పౌర్ణమి సందర్భంగా సిరిసిల్లలో నిర్వహించిన శ్రీ మార్కండేయ స్వామి శోభాయాత్రలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 28 Aug 2026 8:44 PM IST
Sircilla
X

Sircilla: నూలు పౌర్ణమి వేళ మార్కండేయ శోభాయాత్రలో పద్మశాలీలు!

సిరిసిల్ల: నూలు పౌర్ణమి, రాఖీ పౌర్ణమి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన మార్కండేయ శోభాయాత్రలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రలో భక్తులు, సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మార్కండేయ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా శోభాయాత్రను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆది శ్రీనివాస్‌ , ప్రజా ప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు. శోభాయాత్రతో సిరిసిల్ల పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story