Peddapalli: పర్యాటకులను ఆకట్టుకుంటున్న సబ్బితం జలపాతం!

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సబ్బితం గౌరీ గుండాల జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది.

RAJU, PEDDAPALLI
Published on: 31 July 2026 10:31 AM IST
Peddapalli
X

Peddapalli: పర్యాటకులను ఆకట్టుకుంటున్న సబ్బితం జలపాతం!

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో ప్రకృతి అందాలు పరవళ్లు తొక్కుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సబ్బితం గౌరీ గుండాల జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తూ ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పచ్చని కొండల మధ్య జాలువారుతున్న జలధారలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి..గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి మండలంలోని సబ్బితం గౌరీ గుండాల జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. కొండల నడుమ తెల్లని నీటి ధారలు ఉరకలు వేస్తూ ప్రవహిస్తున్న దృశ్యాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

జలపాతం చుట్టూ విరాజిల్లుతున్న పచ్చదనం, చల్లని వాతావరణం, మేఘాల మధ్య నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహం ప్రకృతి సోయగాలను మరింత అందంగా తీర్చిదిద్దుతున్నాయి.

ఈ అద్భుత దృశ్యాలను తిలకించేందుకు స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.

అయితే వర్షాల కారణంగా రాళ్లు జారే అవకాశం ఉండటంతో జలపాతం సమీపంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ప్రస్తుతం సబ్బితం గౌరీ గుండాల జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలు పెద్దపల్లి జిల్లాలో ప్రకృతి వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI

Next Story