Peddapalli: నాపై, పాలకవర్గంపై తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోం సర్పంచ్

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం సర్పంచ్ రేకుల జ్యోతి, పాలకవర్గం తమపై వస్తున్న తప్పుడు ఆరోపణలను ఖండించారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 5 Aug 2026 4:19 PM IST
Peddapalli
X

Peddapalli: నాపై, పాలకవర్గంపై తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోం సర్పంచ్

పెద్దపెల్లి: నాపై, పాలకవర్గంపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని గంగారం సర్పంచ్ రేకుల జ్యోతి అన్నారు. పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రేకుల జ్యోతి ఉపసర్పంచ్ మేడి అశోక్ గౌడ్ తో పాటు పాలకవర్గం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రేకుల జ్యోతి మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కొందరు వ్యక్తులు ఓర్వలేక నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గ్రామపంచాయతీ గ్రామసభ సంబంధించి సోషల్ మీడియాలో అందరికీ తెలియజేశామని నరేష్ అనే వ్యక్తి కావల్సుకుని గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చి మహిళా సర్పంచిని కించపరిచే మాట్లాడారని వారు ఆరోపించారు. సర్పంచ్ గా ఎన్నికైన నుంచి ఏప్పుడు రహస్య గ్రామసభలు నిర్వహించలేదన్నారు.

గ్రామంలో మట్టి పరిమిషన్ జిల్లా కలెక్టరే ఇచ్చారని మట్టికి గ్రామపంచాయతీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. గ్రామంలో చెట్లు నరికివేత టెండర్ వేశామని దాని ద్వారా గ్రామపంచాయతీకి ఆదాయం వచ్చిందన్నారు. తప్పుడు ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు.నాపై పాలకవర్గంపై తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తిపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేడి అశోక్ గౌడ్ వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story