Sircilla: గాలిపల్లిలో భగ్గుమన్న యూరియా కొరత సొసైటీకి తాళం!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా గాలిపల్లిలో యూరియా కొరతపై రైతుల తీవ్ర ఆగ్రహం. పీఏసీఎస్ సొసైటీ ఆఫీసుకు తాళం వేసి బైఠాయించి ఆందోళన.
Sircilla: గాలిపల్లిలో భగ్గుమన్న యూరియా కొరత సొసైటీకి తాళం!
Sircilla: యూరియా కొరతతో రైతుల అవస్థలు కొనసాగుతున్నాయి. సాగు పనులు జోరందుకున్న వేళ పంటలకు అవసరమైన యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్నా అవసరానికి తగ్గట్టుగా సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇల్లంతకుంట మండలం గాలిపల్లిలో యూరియా సరఫరాపై రైతులు ఆందోళనకు దిగారు. గాలిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి తాళం వేసి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
సొసైటీ పరిధిలోని గ్రామాల రైతులకు యూరియా అందించాల్సి ఉండగా.. జిల్లా యూనిట్ పరిధిలోని ఇతర ప్రాంతాల రైతులకు ఎరువులు ఇస్తున్నారని రైతులు ఆరోపించారు. తమ గ్రామాల రైతుల అవసరాలను పట్టించుకోకుండా ఇతర ప్రాంతాలకు యూరియా తరలించడం ఏంటని ప్రశ్నించారు.
ముందుగా సొసైటీ పరిధిలోని రైతుల అవసరాలు తీర్చాలని.. తమకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. పంటలకు కీలకమైన సమయంలో యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగు సమయంలో ఎదురవుతున్న యూరియా కొరత సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు.




