Kalwa Srirampur: మొట్లపల్లి బడి పిల్లలకు ఉచిత షూలు, యూనిఫామ్ పంపిణీ!

Kalwa Srirampur: కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత షూలు, యూనిఫాంలు పంపిణీ చేసిన సర్పంచ్ తుల మనోహర్ రావు.

KONDAL, SULTANABAD
Published on: 8 Sept 2026 2:10 PM IST
Kalwa Srirampur
X

Kalwa Srirampur: మొట్లపల్లి బడి పిల్లలకు ఉచిత షూలు, యూనిఫామ్ పంపిణీ!

Kalwa Srirampur: మొట్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం సర్పంచ్ తుల మనోహర్ రావు పిల్లలకు ఉచిత షూలు, యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలతో పాటు మెరుగైన, నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, ప్రజలు, పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యా సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు.

కార్పొరేట్ స్థాయి విద్య కంటే అధికమైన విద్యా ప్రమాణాలతో ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొమ్మల సుమలత వార్డు సభ్యులు పోగుల రమేష్ రాందేని రాజేశం అనుముల రమేష్ దుమ్మటి శంకరమ్మ బెజ్జాల మానస గాదర్ల శారద సముద్రాల వసంత ప్రధానోపాధ్యాయుడు పులి శ్రీనివాస్ రెడ్డి విద్యార్థినీ, విద్యార్థులు పిల్లల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, పలువురు పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story