Jagtial: జగిత్యాలలో పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు!

Jagtial: జగిత్యాల పట్టణంలో చైతన్య డైరీ పాల వివాదం నేపథ్యంలో పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ తనిఖీలు. శాంపిల్స్ ల్యాబ్‌కు తరలింపు.

ANAND, JAGITYAL
Published on: 15 Sept 2026 4:56 PM IST
Jagtial
X

Jagtial: జగిత్యాలలో పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు!

Jagtial: జగిత్యాల పట్టణంలోని పలు పాల విక్రయ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష నేతృత్వంలో ఈ సోదాలు కొనసాగాయి.

ఇటీవల చైతన్య డైరీ ప్యాకెట్‌లో గమ్‌ వంటి అనుమానాస్పద పదార్థం వచ్చిందంటూ ఒక వినియోగదారుడు చేసిన ఫిర్యాదు జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన అధికారులు చైతన్య డైరీ ఫారంతో పాటు పట్టణంలోని పలు ప్రధాన పాల విక్రయ కేంద్రాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

ల్యాబ్‌కు పాలు, నమూనాలు:

తనిఖీల సందర్భంగా వివిధ సెంటర్ల నుంచి పాల శాంపిల్స్‌ను సేకరించిన అధికారులు, వాటిని నాణ్యతా పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌కు పంపించారు.

చట్టపరమైన చర్యలు తప్పవు:

ఈ సందర్భంగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, పాల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. చైతన్య డైరీ పాలపై వచ్చిన ప్రత్యేక ఫిర్యాదు దృష్ట్యా అక్కడ నమూనాలు సేకరించామని తెలిపారు. ల్యాబ్ నివేదికల్లో నాణ్యతా లోపాలు ఉన్నట్లు తేలితే లేదా నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే సంబంధిత డైరీలను సీజ్ చేయడంతో పాటు, నిర్వాహకులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL