Karimnagar: తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద అజ్ఞాత ఫ్లెక్సీ కలకలం!
Karimnagar: కరీంనగర్ తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద ఆజ్ఞాత ఫ్లెక్సీ కలకలం. ఆర్‌ఓబీ పనుల ఆలస్యంపై నాయకులను, ప్రజలను ప్రశ్నించిన వైనం.
Karimnagar: తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద అజ్ఞాత ఫ్లెక్సీ కలకలం!
Karimnagar: కరీంనగర్ తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ గేటు వద్ద ఎవరో అనామకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపుతుంది. నాయకులను, ప్రజలను చైతన్య పరుస్తూ విమర్శించే విధంగా ఫ్లెక్సీ ని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో రాజకీయ నాయకులతో పాటు ప్రజలను కూడా ప్రశ్నించాడు. ఫ్లెక్సీ ఎవరు ఏర్పాటు చేశారు ఎలాంటి అడ్రస్ లేకుండా ప్రజలకు అవగాహన ఏర్పడే విధంగా ఏర్పాటు చేశాడు. రైల్వే గేట్ వద్ద ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్న ప్రజలను వారు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులను అడగాలని, అదేవిధంగా ప్రజలకు ఇబ్బందులు తొలగించే విధంగా నాయకులు స్పందించి పనులు పూర్తి చేయాలని ఆ ఫ్లెక్సీలో రాశారు.
పట్టింపు లేని నాయకులు, మాకెందుకులే అనే ప్రజలు, దుమ్ముతో అల్లాడిపోతున్న స్కూల్ విద్యార్థులు, ప్రశ్నించలేని ప్రజలు అని ఫ్లెక్సీలో రాసి అందరికీ కనిపించే విధంగా ఏర్పాటు చేశాడు. గేటు ముందు నిలబడి చూస్తున్న వాహనదారులు ఆ ఫ్లెక్సీ ని ఒక క్షణం ఆగి చదివి ఇది నిజమే అనుకుంటూ వెళుతున్నారు.
రైల్వే గేటు రోడ్డు నుండి వెళ్ళని నాయకులు అధికారులు.
గత రెండున్నర సంవత్సరాలుగా పనులు నత్తనడకన సాగుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నారు. ఓ పక్క రైల్వే గేటు పడ్డ సమయంలో భారీగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు ఇబ్బందులు దీనితోపాటు దుమ్ము పొగ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో చిరుజల్లుకే కుంటలు చెరువులను తలపిస్తున్న రైల్వే గేట్ వద్ద గుంతలు. గతంలో ఎందరో ఈ గుంతలలో పడి ప్రమాదాలకు కొనితెచ్చుకున్నారు అధికారులు స్పందించడం లేదు నాయకులు స్పందించడం లేదు.
ఈ పరిస్థితిపై రాజకీయ నాయకులు సామాజిక కార్యకర్తలు కూడా నిరసన వ్యక్తం చేసిన కాంట్రాక్టర్ కానీ అధికారులు కానీ ఇప్పటివరకు స్పందించింది లేదు. నిన్న పడ్డ చిరుజల్లుకి వరి నాట్లు వేసుకునే విధంగా తయారైంది ఈ రోడ్డు. ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేందుకు అజ్ఞాత వ్యక్తి సామాజిక స్పృహతో ఫ్లెక్సీ ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు వాహనదారులు ప్రజలు అనుకుంటున్నారు.




