Sircilla: సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో ఘనంగా గణనాథుని ప్రతిష్ట!
Sircilla: రాజన్న సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో అధ్యక్షుడు ఆకుల జయంత్ కుమార్ ఆధ్వర్యంలో తొలిసారిగా గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పాత్రికేయులు పూజలు చేశారు.
Sircilla: సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో ఘనంగా గణనాథుని ప్రతిష్ట!
Sircilla: వినాయక చవితి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు ఆకుల జయంత్ కుమార్ నేతృత్వంలో తొలిసారిగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్‌లోని పాత్రికేయులు పూజల్లో పాల్గొని గణనాథుడిని దర్శించుకున్నారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కరుణాల భద్రాచలం, తవుటు విశ్వనాథం, టీవీ నారాయణ, కాంబోజు ముత్యం, పాలమాకుల శేఖర్, మిట్టపల్లి కాశీనాథ్, ప్రసాద్ రెడ్డి, సయ్యద్ కలీమ్, అతికం రఘు, ఇస్మత్ మోయీన్, నాగరాజు గౌడ్,గంగు సతీష్, పర్కాల ప్రవీణ్, వొడ్నాల వేణు, మునీందర్ రెడ్డి, పాషా, అన్సార్ అలీ, నాయిని బాబు, మల్లికార్జున్, అరుణ్, దారం కృష్ణ, రాము, రామనాథం, రమణయ్య, ఆకునూరి శంకర్, గోవిందు వేణు, రాపెల్లి భాస్కర్, శిరీష, సౌమ్య, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.




