Sircilla: ఇల్లంతకుంట ఆగ్రో ఇండస్ట్రీస్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం
Sircilla: తాళ్లపల్లి శ్రీ రాజరాజేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌లో అగ్నిప్రమాదం. పత్తిగింజల బస్తాలు అగ్నికి ఆహుతి. ప్రమాదంపై పలు అనుమానాలు, దర్యాప్తు ప్రారంభం.
Sircilla: ఇల్లంతకుంట ఆగ్రో ఇండస్ట్రీస్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పత్తిగింజల బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి.
అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో కొద్దిపాటి ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.
అయితే మిల్లులో నిల్వ చేసిన పత్తిగింజల బస్తాలకు ఇరువైపులా ఉన్న వడ్ల బస్తాలకు పెద్దగా నష్టం జరగకపోవడం, మధ్యలో ఉన్న పత్తిగింజల బస్తాలకే మంటలు వ్యాపించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




