Karimnagar: అగ్నిప్రమాదం.. బూడిదైన 'కేక్స్ అండ్ బేక్స్' బేకరీ!

Karimnagar: బస్టాండ్ సమీపంలోని 'కేక్స్ అండ్ బేక్స్' బేకరీలో షార్ట్ సర్క్యూట్‌ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించి షాప్ పూర్తిగా దగ్ధమైంది.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 26 July 2026 5:21 PM IST
Karimnagar
X

Karimnagar: అగ్నిప్రమాదం.. బూడిదైన 'కేక్స్ అండ్ బేక్స్' బేకరీ!

కరీంనగర్: ​కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నేతి రవివర్మకు చెందిన 'కేక్స్ అండ్ బేక్స్' బేకరీలో గత అర్ధరాత్రి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బేకరీ పూర్తిగా కాలి బూడిదైంది.

​ఈ ప్రమాద వార్త తెలుసుకున్న మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేరుగా సంఘటన స్థలానికి చేరుకుని బేకరీని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, ఆస్తినష్టం వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఘటన వివరాలను ఆరా తీశారు. ఈ కష్టకాలంలో అధైర్యపడవద్దని బేకరీ నిర్వాహకులకు ఆయన భరోసా కల్పించి ధైర్యం చెప్పారు.

​ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, బేకరీ నిర్వాహకులు నేతి రవివర్మ, లోకేందర్ వంశీకృష్ణ రవి తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story