Karimnagar: సుందరగిరిలో విద్యుత్ కోతలపై రైతుల రాస్తారోకో!

Karimnagar: కరీంనగర్ జిల్లా సుందరగిరిలో విద్యుత్ కోతలతో ఎండిపోయిన పంటలతో రైతులు కరీంనగర్-హుస్నాబాద్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 11 Sept 2026 1:43 PM IST
Karimnagar
X

Karimnagar: సుందరగిరిలో విద్యుత్ కోతలపై రైతుల రాస్తారోకో!

Karimnagar: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో వ్యవసాయ విద్యుత్ కోతలకు నిరసనగా పలు గ్రామాల రైతులు రాస్తారోకో చేపట్టారు.

రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ధర్నాలో పాల్గొని నిరసన తెలిపారు. ఎండిపోయిన మొక్కజొన్న, పత్తి, వరి పంట కర్రలను చేతబట్టి రైతులు కరీంనగర్–హుస్నాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా అందకపోవడంతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు.

వ్యవసాయానికి ఎలాంటి కోతలు లేకుండా 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించి, పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

రైతుల రాస్తారోకోతో కరీంనగర్–హుస్నాబాద్ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారులు పోలీసులు సంఘటన స్థానానికి వచ్చి రైతులను శాంతింపజేశారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD