Karimnagar: బావిలో పడి రైతు మృతి: కరీంనగర్ చామన్‌పల్లిలో విషాదం!

Karimnagar: రీంనగర్ రూరల్ మండలం చామన్‌పల్లిలో విషాదం. వ్యవసాయ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో జారిపడి రైతు బొజ్జ లచ్చయ్య (55) మృతి చెందాడు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 6 Sept 2026 5:49 PM IST
Karimnagar
X

Karimnagar: బావిలో పడి రైతు మృతి: కరీంనగర్ చామన్‌పల్లిలో విషాదం!

కరీంనగర్: కరీంనగర్ రూరల్ మండలంలోని చామన్ పల్లి గ్రామ శివారులో వ్యవసాయ పనులు చేసుకుంటున్న ఓ రైతు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

తేదీ 05-09-2026 నాడు చామన పల్లి గ్రామానికి చెందిన బొజ్జ లచ్చయ్య 55 సంవత్సరాలు వ్యవసాయ రైతు, తన వ్యవసాయ భూమిలోని బావి వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు జారి బావిలో పడిపోయాడు. ఈ క్రమంలో బావిలో ఉన్న రాళ్లపై పడటంతో తలకు మరియు శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నీటిలో పడిపోవడంతో మునిగిపోయినట్లు తెలుస్తోంది.

లచ్చయ్య సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మరియు బంధువులు అతని కోసం వెతకగా, బావి సమీపంలో అతని వస్తువులు మరియు ఫోన్ కనిపించాయి. దీంతో బావిలో పడిపోయి ఉండవచ్చనే అనుమానంతో బావిలో పరిశీలించగా నీటిలో లచ్చయ్య కనిపించాడు. వెంటనే అతడిని బావిలో నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి అప్పటికే లచ్చయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య బొజ్జ రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story