Jagtial: జగిత్యాలలో గడువు ముగిసిన ఐస్‌క్రీమ్‌ల కలకలం: అధికారుల దాడి!

Jagtial: జగిత్యాల పట్టణంలోని కరీంనగర్ డైరీ పాలకేంద్రంలో ఫుడ్ ఇన్స్‌పెక్టర్ అనూష తనిఖీలు. ఫంగస్ పట్టిన, గడువు ముగిసిన 600 ఐస్‌క్రీమ్‌లు సీజ్.

ANAND, JAGITYAL
Published on: 13 Aug 2026 8:40 PM IST
Jagtial
X

Jagtial: జగిత్యాలలో గడువు ముగిసిన ఐస్‌క్రీమ్‌ల కలకలం: అధికారుల దాడి!

జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని కరీంనగర్‌ డైరీ పాలకేంద్రంలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనూష ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించగా.. ఏకంగా 600 ఐస్‌క్రీములు .v ఫ్రీజర్‌ సరిగా పనిచేయకపోవడంతో ఐస్‌క్రీములు కరిగిపోవడంతో పాటు ఫంగస్‌ పట్టినట్లు అధికారులు తెలిపారు.

డైరీ నిర్వాహకులు వాటిని రిటర్న్‌ పంపిస్తున్నామని చెప్పినప్పటికీ.. తిరిగి వాటిని ఇతర ఐస్‌క్రీములతో కలిపే అవకాశం ఉండటంతో అధికారులు వాటిని సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనూష మాట్లాడుతూ.. పలు నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నామని, ల్యాబ్‌ నివేదిక వచ్చిన అనంతరం నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story